Chitram news
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 1:56 pm Editor : Chitram news

ప్రభుత్వ విప్ విజయరమణారావుకు ఆదిలాబాద్‌లో ఘన స్వాగతం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో సోమవారం చేపట్టనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విచ్చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయరమణారావుకు ఆదిలాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా విజయ రమణా రావును కంది శ్రీనివాస రెడ్డి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంతోష్, శాంతన్ రావ్,లోక ప్రవీణ్ రెడ్డి, అశోక్ రెడ్డి, రాంరెడ్డి, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో పిప్రిలో సభా ప్రాంగణం, భద్రతా ఏర్పాట్లు, జన సమీకరణపై నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు.