-Advertisement-

వెంకుర్‌లో మొక్కజొన్న సంచుల దొంగతనం

చిత్రం న్యూస్, నిర్మల్ బ్యూరో:  నిర్మల్ జిల్లా కుంటాల మండలం వెంకుర్ గ్రామంలో రైతు మగ్గిడి నారాయణకు చెందిన మొక్కజొన్న సంచులు రాత్రి దొంగతనానికి గురయ్యాయి. రోడ్డు పక్కన భద్రపరిచిన సంచులను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోవడంతో రైతు ఆందోళన వ్యక్తం చేశారు.వెంకుర్ గ్రామానికి చెందిన రైతు మగ్గిడి నారాయణ, తన పొలంలో పండించిన మొక్కజొన్నను సంచుల్లో నింపి, గ్రామంలోని రోడ్డు పక్కన ఉంచారు. అయితే, రాత్రి సమయంలో దుండగులు ఈ సంచులను దొంగిలించి తీసుకెళ్లారు. ఉదయం సంచులు కనిపించకపోవడంతో రైతు నారాయణ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విషయంపై వెంటనే సంబందిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments