ప్రజా సంక్షేమమే మా ధ్యేయం: మేయర్ ఉమారాణి రమేష్
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ మేయర్ ఉమారాణి రమేష్ శనివారం ఆలీ సాగర్ రిజర్వాయర్ను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. నీటి మట్టాలు, నిల్వ సామర్థ్యం, ప్రజలకు తాగునీటి సరఫరా అంశాలపై అధికారులతో కలిసి సమీక్షించారు. ఇటీవల అక్కడ జరిగిన దొంగతనం ఘటనపై కూడా మేయర్ చర్చించారు. ఆ ఘటన ఎలా జరిగిందో పూర్తిగా వివరాలు తెలుసుకుని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠినమైన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని అధికారులకు...