నర్సంపేట గ్రంథాలయానికి జనతా ట్రస్ట్ చేయూత – విద్యార్థుల సౌకర్యార్థం ఫర్నిచర్ పంపిణీ
చిత్రం న్యూస్,నర్సంపేట: ప్రభుత్వ గ్రంథాలయంలో చదువుకుంటున్న విద్యార్థుల సౌకర్యార్థం జనతా ట్రస్ట్ మిత్ర బృందం అండగా నిలిచింది. గ్రంథాలయంలో కనీస వసతులు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ట్రస్ట్ ప్రతినిధులు, వారికి అవసరమైన టేబుల్స్, కుర్చీలు, వాటర్ డిస్పెన్సర్‌ను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా జనతా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ఈ సాయం చేసినట్లు తెలిపారు. ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యే...