CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: నిరుపేద కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందిన 67 మంది లబ్ధిదారులకు రూ.18.90 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు: ఆదిలాబాద్ ప్రజలు మెరుగైన...