Chitram news
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 6:55 pm Editor : Chitram news

డ్రైవర్లు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిత్యం వాహనాలు నడిపే డ్రైవర్లు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలని ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ సూచించారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మోపాల్ ఎస్ హెచ్ ఓ జెడ్. సుస్మిత ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్, జీజీహెచ్​ నిజామాబాద్​ సహకారంతో మోపాల్​లో డ్రైవర్లకు కంటి, చెవి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ మస్తాన్​ అలీ మాట్లాడుతూ.. భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు ఎల్లప్పుడూ కంటి, చెవి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆరోగ్యం బాగుంటేనే వాహనాలు సక్రమంగా నడపగలుగుతామని వివరించారు. శిబిరంలో సుమారు 80 మంది డ్రైవర్లు, 30 మంది మోపాల్​ గ్రామస్థులకు వైద్యులు అమర్​దీపిక, శ్రవంతి, లయన్స్​ క్లబ్​ బృందం సభ్యులు చెవి, కంటి పరీక్షలునిర్వహించారు. అనంతరం పలువురు డ్రైవర్లకు కళ్లద్దాలు సైతం అందజేశారు. కార్యక్రమంలో సౌత్​ రూరల్​ సీఐ సురేష్​, మోపాల్​ ఎస్ హెచ్ ఓ జెడ్. సుస్మిత తదితరులు పాల్గొన్నారు.