Chitram news
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 5:49 pm Editor : Chitram news

సీఎం కప్ పోటీల్లో అమ్మాయిలు అదరగొట్టడం అభినందనీయం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

సీఎం కప్ బేస్ బాల్ బాలికల పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన నిజామాబాద్ జట్టు 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : గ్రామీణ స్థాయిలో క్రీడాకారుల నైపుణ్యాలను వెలికితీసేందుకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీఎం కప్ పోటీల్లో నిజామాబాద్ బేస్ బాల్ బాలికల జట్టు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి అన్నారు. ఇటీవల సీఎం కప్ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో లో నిర్వహించగా.. నిజామాబాద్ నుంచి బేస్ బాల్ బాలికల జట్టు కెప్టెన్ ఇందు నేతృత్వంలో అత్యుత్తమ ప్రదర్శనతో ఘన విజయం సాధించారు. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కప్ ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో విజేతగా నిలిచిన బాలికల జట్టు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డినిక్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జట్టు కోచ్ అనికేత్,బేస్ బాల్ జిల్లా కార్యదర్శి వినోద్,తో పాటు సహకారం అందించిన సాఫ్ట్ బాల్ జిల్లా కార్యదర్శి గంగామోహన్ లను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. రాబోవు రోజుల్లో బాలికలను క్క్రీడల్లో ప్రోత్సహించాలని తద్వారా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. బాలికలు ఉన్నత విద్య తో పాటు క్రీడల్లో రాణించి గొప్ప గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.