చిత్రం న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో: మాజీ మంత్రి డీఎస్ తనయుడు, నిజామాబాద్ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్కు పదవి ఇవ్వాలని ఆయన అభిమానులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అభివృద్ధికి ఎనలేని కృషిచేస్తున్న డి.సంజయ్కు గుర్తింపు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆయన అభ్యర్థుల గెలుపు కోసం విశేషంగా కృషి చేశారన్నారు. ఆయన సేవలను గుర్తించి పదవి ఇవ్వాలని వారు కోరారు. ధర్మపురి సంజయ్ ఏ పార్టీలో ఉన్నా తాము ఆయన వెన్నంటే ఉంటామన్నారు. నిరాహార దీక్షలో సంజయ్ అభిమానులు ఆకుల చిన్న రాజేశ్వర్, ఆమందు వెంకటేష్, కపిల్, పుప్పాల భాజన్న, సక్కి విజయ్, పుప్పాల విజయ, సందీప్, రణధీర్, రింపు, తదితరులు పాల్గొన్నారు.