బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కలిసి మంత్రి జూపల్లి భోజనం
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలోని ప్రతిష్టాత్మక బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని (RGUKT) రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి మెస్‌లో రాత్రి భోజనం చేశారు. విద్యార్థుల మధ్య కూర్చున్న మంత్రి, వారికి వడ్డిస్తున్న ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు. భోజనం నాణ్యతపై ఆరా..భోజనం చేస్తున్న సమయంలో విద్యార్థులతో మంత్రి ఆప్యాయంగా మాట్లాడారు. రోజువారీ మెనూ ప్రకారం భోజనం అందుతోందా? అని ఆరా...