ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
చిత్రం న్యూస్, ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ పట్టణంలోని రోస్ గార్డెన్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క సమావేశానికి అధ్యక్షత వహించారు. సమావేశానికి ముందు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్‌లకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి సుగుణక్క ఘన స్వాగతం పలికి, శాలువాలతో సన్మానించారు. అనంతరం నూతన జిల్లా కార్యవర్గ సభ్యులకు...