హనుమాన్ మందిరానికి గడియారం విరాళంగా అందజేత
చిత్రం న్యూస్, సాత్నాల: ఆధ్యాత్మిక మార్గంలో హనుమాన్ దీక్ష చేపట్టిన భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. శుక్రవారం తమ సొంత గ్రామమైన జామ్ని లోని హనుమాన్ మందిరానికి కుమ్ర జగదీష్, సునీల్, ఇతర దీక్షా స్వాములు కలిసి ఒక పెద్ద గడియారాన్ని విరాళంగా అందజేశారు. స్వామివారి సేవలో భాగంగా ఈ విరాళం అందించడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. వీరి చొరవను ఆలయ కమిటీ, గ్రామస్తులు అభినందించారు.