గోదావరి పుష్కరాల ఘాట్లను సందర్శించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని తుంగిని గ్రామం వద్ద గల పుష్కర ఘాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య,శుక్రవారంసందర్శించారు.2027 సంవత్సర కాలంలో రాబోయే గోదారి పుష్కరాలను ఉద్దేశించి పుష్కర ఘాట్ల ఏర్పాట్లు , మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, పుష్కర ఘాటుకు వచ్చే పోయే దారులు, పార్కింగ్ ప్రదేశాలు పరిశీలించారు. నీళ్లలో ఎవరు కూడా మునిగి ప్రాణ నష్టం జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటులను చేయాలని అధికారులకు సూచించారు గ్రామస్తులతో...