బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు జూపల్లి, వివేక్
చిత్రం న్యూస్, బజార్ హత్నూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల' కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6న ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొనే ఈ భారీ సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన మంత్రుల బృందానికి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కంది...