ఆదిలాబాద్‌లో ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో ఇస్కాన్ (ISKCON) దేవాలయ నిర్మాణానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే శ్రీ పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..భారతదేశంలో హిందువులుగా జన్మించడం మన పూర్వజన్మ సుకృతమని, ఇది ఎంతో అదృష్టకరమని అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు యుద్ధాలు, అశాంతితో అల్లాడుతుంటే, భారతదేశం నేడు అత్యంత సురక్షితంగా, శాంతియుతంగా ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రభూవానంద...