భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ఆరాధనలు
చిత్రం న్యూస్, దండేపల్లి: దండేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలోని CSI వెస్లీ చర్చి వెంకటాపూర్ తో పాటుగా ఇతర చర్చిలలో గుడ్ ఫ్రైడే సందర్భంగా గుడ్ ఫ్రైడే ఆరాధనలు ఘనంగా నిర్వహించారు. యేసు క్రీస్తు శిలువ త్యాగాన్ని స్మరించుకుంటూ ఉదయం నుంచే విశ్వాసులు చర్చిలకు చేరుకొని ప్రార్థనలు, కీర్తనలు చేశారు. శిలువ మార్గం ఆచరణతో పాటు ఉపవాస దీక్షలు పాటిస్తూ భక్తులు ఆధ్యాత్మికంగా నిమగ్నమయ్యారు. ఈ ఆరాధనలో Rev. S. వరప్రసాద రావు దైవ సందేశం అందించారు....