Chitram news
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 3:16 pm Editor : Chitram news

జోడాంజనేయ స్వామిని దర్శించుకున్న కలెక్టర్ గరిమ అగ్రవాల్

చిత్రం న్యూస్, వేములవాడ: మండలంలోని అగ్రహారం గ్రామంలోని శ్రీ జోడాంజనేయ స్వామి దేవస్థానాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ ఇంఛార్జి ఈఓ వెంకన్న, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు కలెక్టర్ కు ఆలయ విశిష్టతను వివరించారు. జిల్లా కలెక్టర్ శ్రీ జోడాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు అందజేసి ఆమెను సన్మానించారు. స్వామివారి సన్నిధిలో కొంత సమయం గడిపి, భక్తులతో కలిసి ప్రార్థనలు చేశారు.