Chitram news
Newspaper Banner
Date of Publish : 02 April 2026, 9:42 pm Editor : Chitram news

ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు 

చిత్రం న్యూస్, పాల్వంచ: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నదని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక)లో భాగంగా గురువారం పాల్వంచ మండలం పరిధిలోని నాగారం, బసవతారక కాలనీలలో జరిగిన గ్రామ సభలలో  కొత్వాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి చేపడుతున్నదన్నారు. ఆరు గ్యారంటీలలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సబ్సిడీ పథకం, సన్న రకం ధాన్యం కొనుగోలుకు క్వింటాకు రూ.500 బోనస్, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, త్వరలో కొత్త పెన్షన్ ల పంపిణీ, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ల మంజూరు వంటి పథకాలు ప్రజలకు అందిస్తుందన్నారు. త్వరలో  ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం, ఇంటర్మీడియట్ వరకు అల్పాహారం పథకం, మధ్యాహ్న భోజన పథకం* వంటి పథకాలు చేపట్టబోతున్నదన్నారు. ప్రజలు కాంగ్రెస్ పధకాలను సద్వినియోగం చేసుకోవాలని కొత్వాల కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓ నారాయణ, సర్పంచ్ జర్పుల కాశమ్మ, ఉప సర్పంచ్ భాగ్యమ్మ, నాగారం సర్పంచ్ దారావత్ స్వప్న, ఉప సర్పంచ్ రంజిత్, స్పెషల్ ఆఫీసర్, మిషన్ భగీరథ ఏ ఈ మహేశ్వరీ, పంచాయతీ కార్యదర్శి అజ్మీరా రాంబాబు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న గౌడ్, చల్లా వెంకన్న, జర్పుల వెంకన్న, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.