చిత్రం న్యూస్, పరకాల రూరల్: పరకాల రూరల్ మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన బీజేపీ బూత్ అధ్యక్షుడు ఏకు సదయ్య నూతనంగా నిర్మించుకున్న గృహ ప్రవేశ మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాళీ ప్రసాద్ రావు నూతన గృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సదయ్య కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పరకాల మండల అధ్యక్షుడు కాసగాని రాజ్ కుమార్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు సింగడి శ్రీనివాసరెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు కునూరు వీరాస్వామి, గ్రామ శక్తి కేంద్ర ఇంచార్జ్ గంట శ్రీనివాస్ రెడ్డి, అశోక్ మరియు పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


