ఆంజనేయ స్వామికి వెండి కిరీటం సమర్పించిన డా.కళ్లెం జీవిత-వెంకట్ రెడ్డి దంపతులు
చిత్రం న్యూస్, సాత్నాల: హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డా. కళ్ళెం జీవిత, డా.కళ్ళెం వెంకట్ రెడ్డి దంపతులు తమ భక్తిని చాటుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం మేడిగూడ గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వామికి వారు వెండి కిరీటాన్ని కానుకగా సమర్పించారు. ఈ సందర్భంగా మేడిగూడ గ్రామానికి విచ్చేసిన డాక్టర్ దంపతులకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, మంగళ హారతులతో గ్రామం కోలాహలంగా మారింది. కుటుంబ సమేతంగా ఆలయంలో...