* జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు మహనీయుల చిత్ర పటాన్ని అందజేసిన దళిత సంఘాల నాయకులు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మహనీయుల జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశం మందిరంలో దళిత సంఘాల సమితి ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈనెల 05 తేదీన బాబు జగజీవన్ రామ్ జయంతి, 14 న బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా సన్నాహక నిర్వహణ కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో ప్రతినిధులు సూచనలు అందిందిన క్రమంలో దళిత సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కి మహనీయుల చిత్ర పటాలను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ ,ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్ , షెడ్యూల్ క్యాస్ట్ అభివృద్ధి అధికారి సునీత. ఈ.డీ మనోహర్, దళిత సంఘాల ప్రతినిధులు మేకల మల్లన్న.మల్యాల స్వామి, దుర్గం శేఖర్, బాల శంకర్ కృష్ణ, రత్న జాడే ప్రజ్ఞ కుమార్, మల్యాల మనోజ్ కుమార్, నక్కారాందాస్, రాజన్న, అల్లూరి భూమన్న, ఆయిండ్ల శశికాంత్ , దాన్డిగే సందీప్, వాగ్మారే బింరావ్, కొప్పుల రమేష్.అగ్గిమళ్ళ గణేష్, ఆరేల్లి మల్లేష్, నిమ్మల ప్రశాంత్, దర్శనాల నగేష్.. కాంబ్లే బాలాజీ, బిక్కి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.


