ఆశా వర్కర్ పద్మకు న్యాయం చేయాలి: సీఐటీయూ
చిత్రం న్యూస్, నిర్మల్: ఖానాపూర్ మండలం సోమరిపేట్ గ్రామానికి చెందిన ఆశా వర్కర్ పద్మకు న్యాయం చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ ) నిర్మల్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. గ్రామస్తులు వెలివేసిన ఒక గర్భిణికి సేవలు అందించినందుకు ఆమెను ఏఎన్ఎమ్ చంద్రకళ అసభ్య పదజాలంతో దూషించిందని, దీనితో పద్మ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని యూనియన్ ఆరోపించింది. ఆదివాసీ గ్రామానికి చెందిన ఓ మహిళను గ్రామస్తులు వెలివేయడం జరిగిన సంఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోందని సీఐటీయూ...