చిత్రం న్యూస్, భోరజ్: అంకిత భావంతో పనిచేస్తేనే ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ దీపక్ రావు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శాంతన్ రావు అన్నారు. ఇంచార్జి ఎంపీడీఓ చిల్కూరి వేణు రెడ్డి రిటైర్మెంట్ సందర్భంగా మంగళవారం మండలంలోని సిర్సన్న రైతు వేదికలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేణు రెడ్డి దంపతులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో ఆయన చేసిన సేవలను మండల నాయకులు కొనియాడారు. కాంగ్రెస్ నాయకులు అల్లూరి భూమారెడ్డి, మామిడి మల్లారెడ్డి, సన్నీ ప్రకాష్ రెడ్డి, పొట్ట అశోక్, ఆశా రెడ్డి, శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.


