సీఎం బాసర పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, ఆహ్లాదక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. బాసర ఆలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రానున్నందున, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి ఆయన సమీక్షించారు. ముందుగా పలు నిర్మాణాలు చేపట్టబోయే ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పలు నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపనలు చేసే ప్రాంతాలను చూశారు. పనుల ప్రారంభోత్సవాల...