ఏప్రిల్ 2నుంచి గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు
చిత్రం న్యూస్, దండేపల్లి: దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఏప్రిల్ 2వ తేదీన ప్రత్యేక గ్రామసభలను నిర్వహించనున్నట్లు మండల ప్రత్యేక అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఈ గ్రామసభలు నిర్వహించబడనున్నట్లు పేర్కొన్నారు. గ్రామస్థుల సమావేశాలకు తప్పనిసరిగా హాజరై తమ సమస్యలు, అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు. ఇదే సందర్భంలో టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ సిబ్బంది, గ్రామ కార్యదర్శులు కలిసి గ్రామాభివృద్ధికి సంబంధించిన పనులపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న...