-Advertisement-

ఏప్రిల్ 2నుంచి గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు

చిత్రం న్యూస్, దండేపల్లి:  దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఏప్రిల్ 2వ తేదీన ప్రత్యేక గ్రామసభలను నిర్వహించనున్నట్లు మండల ప్రత్యేక అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఈ గ్రామసభలు నిర్వహించబడనున్నట్లు పేర్కొన్నారు. గ్రామస్థుల సమావేశాలకు తప్పనిసరిగా హాజరై తమ సమస్యలు, అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు. ఇదే సందర్భంలో టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ సిబ్బంది, గ్రామ కార్యదర్శులు కలిసి గ్రామాభివృద్ధికి సంబంధించిన పనులపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి ప్రయోజనాలు, అర్హతలపై వివరాలు అందించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ గ్రామసభలు ప్రజలకు వేదికగా మారి, వారి సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పిస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

✖ Close హోం
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments