Chitram news
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 10:28 am Editor : Chitram news

బాసర అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసరలోని పవిత్రమైన పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు బృందం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . ముందుగా ఆలయ ఈవో  విజయ రామారావు, ఆలయ అర్చకులు దేవదాయ శాఖ బృందానికి స్వాగతం పలికారు. ఆలయ పరిసరాలను సందర్శించారు. వచ్చేనెల 6న సీఎం రేవంత్ రెడ్డి బాసరకి పర్యటన వస్తున్న నేపథ్యంలో ఉదయం 11 గంటలకు అమ్మవారిని దర్శించుకొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. పునర్నిర్మాణ పురోగతిని అధికారులు తహసిల్దార్ పవన్ చంద్ర, ఎంపీడీవో దేవేందర్ రెడ్డి, తదితరులతో  కలిసి పరిశీలించారు. బాసర సిఐ కిరణ్ ఉన్నారు.