గంగబీ-దస్తగిరి దంపతులకు సారె అందజేసిన డీసీసీ ఉపాధ్యక్షుడు దీపక్ రావు
చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని గూడ గ్రామంలో లబ్ధిదారురాలు గంగబీ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో ఆదివారం డీసీసీ ఉపాధ్యక్షుడు దీపక్ రావు, రాష్ట్ర యూత్ కార్యదర్శి రంగినేని శాంతన్ రావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. లబ్ధిదారు గంగబీ-దస్తగిరి దంపతులకు సారె అందజేశారు. వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం భోరజ్ మండల కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. నాయకులు మామిడి మల్లారెడ్డి, భూమారెడ్డి, నిమ్మల ప్రభాకర్, భూతం...