Chitram news
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 8:39 am Editor : Chitram news

14 ఏళ్ల రికార్డుకు బ్రేక్: కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం

చిత్రం న్యూస్, ముంబై: ఐపీఎల్ 2026 సీజన్ రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన చేసింది. గత 14 ఏళ్లుగా (2012 నుండి) తమ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడిపోతున్నాన్న రికార్డును (Jinx) చెరిపివేస్తూ, కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.

ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. అజింక్య రహానే (67), అంగ్క్రిష్ రఘువంశీ (51) అర్ధసెంచరీలతో రాణించారు. 221 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. ర్యాన్ రికెల్టన్ (81), రోహిత్ శర్మ (78) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు విజయాన్ని అందించారు.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మూడు కీలక వికెట్లు పడగొట్టిన శార్దుల్ ఠాకూర్ ఈ అవార్డును దక్కించుకున్నారు.

వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ పోరులో ముంబై బ్యాటర్లు ఆరంభం నుండే ఎదురుదాడి చేయడంతో కేకేఆర్ బౌలర్లు చేతులెత్తేశారు. చివరి ఓవర్లో నమన్ ధీర్ ఫోర్ కొట్టి ముంబైకి చిరస్మరణీయ విజయాన్ని అందించారు.