లక్ష్మయ్య కుటుంబానికి రూ.5వేలు ఆర్థిక సాయం అందజేసిన అమ్మానాన్న పౌండేషన్ ఛైర్మన్ యం.ఆంజనేయులు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఎడ్ బిడ్ గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుటుంబానికి అమ్మానాన్న పౌండేషన్ ఛైర్మన్ యం.ఆంజనేయులు రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశారు. లక్ష్మయ్యకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఆయన ఐదు రోజుల క్రితం మృతిచెందారు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మా అమ్మానాన్న పౌండేషన్ ఛైర్మన్ యం.ఆంజనేయులు కుమారుడు సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆ నిరుపేద కుటుంబానికి రూ.5 వేలు అందజేసి ఉదరాత చాటారు. ఈ కార్యక్రమంలో సాయం రెడ్డి, రాములు (వార్డ్ మెంబర్), మొడం సాయన్న, సుమిద్ కుమార్, ఎల్లన్న, సతీష్, ముత్తన్న, తదితరులు పాల్గొన్నారు.



