చిత్రం న్యూస్: బెంగళూరు: ఐపీఎల్ 19వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ తన ప్రతాపాన్ని చూపించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. స్టాండ్-ఇన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 80 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.చివరలో అనికేత్ వర్మ (18 బంతుల్లో 43) వేగంగా ఆడటంతో హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. ఆర్‌సీబీ బౌలర్లలో డెబ్యూటెంట్ జాకబ్ డఫీ 3 వికెట్లతో రాణించాడు.
202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి ఆరంభంలోనే ఫిలిప్ సాల్ట్ వికెట్ కోల్పోయినప్పటికీ, ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. దేవ్‌దత్ పడిక్కల్ కేవలం 26 బంతుల్లోనే 61 పరుగులు చేసి ఆర్‌సీబీకి గట్టి పునాది వేశాడు.విరాట్ కోహ్లీ తన క్లాస్ ఆటతో 38 బంతుల్లో 69 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.చివరలో రజత్ పాటిదార్ (31) మెరుపులు మెరిపించడంతో ఆర్‌సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జాకబ్ డఫీ (RCB)
టాప్ స్కోరర్ (SRH) ఇషాన్ కిషన్ (80 రన్స్)
టాప్ స్కోరర్ (RCB) విరాట్ కోహ్లీ (69* రన్స్)
ఈ విజయంతో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆర్‌సీబీ తన ప్రయాణాన్ని ఘనంగా చాటుకుంది. సన్‌రైజర్స్ తదుపరి మ్యాచ్‌లో పుంజుకోవాలని ఆశిస్తోంది.



