చిత్రం న్యూస్,జైనథ్:ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని చారిత్రాత్మక శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో శనివారం ఆదిలాబాద్ నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు. లోకకళ్యాణార్థం నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ వ్రతాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ మాజీ చైర్మన్ అడ్డి రూకేష్ రెడ్డి గిమ్మ సంతోష్ రావు దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించి, తీర్థప్రసాదాలు అందజేశారు.




