సీఎం, మంత్రుల ఫ్లెక్సీలకు ఆత్రం సుగుణ పాలాభిషేకం
చిత్రం న్యూస్, ఆసిఫాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను విడుదల చేయడంతో రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తెలిపారు. శుక్రవారం డీసీసీ కార్యాలయం ఆవరణలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఇరుకుల మంగ, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీకి సుగుణ పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా సుగుణ మాట్లాడుతూ..రైతు భరోసా నిధుల విడుదలతో రాష్ట్రంలోని రైతుల్లో ఆనంద వాతావరణం నెలకొన్నదన్నారు. ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతు భరోసా పథకం ద్వారా రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో నిధులు జమ కావడం ప్రభుత్వ రైతు అనుకూల విధానాలకు నిదర్శనమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్, జిల్లా ఉపాధ్యక్షులు తారిఖ్,భీమ్ రావ్,కౌన్సిలర్ వినోద్,RGPRS ఇంచార్జి కోవా ఇందిరా,సిడాం తిరుపతి మాజీ ఎంపీటీసీ,నాయకులు పెందొర్ సుధాకర్, ఇమ్రాన్, నిజం,ఆత్రం భీం రావ్,హరీష్, రాము,AMC డైరెక్టర్ జకన్నా,మోహన్, శంకర్,తదితరులు పాల్గొన్నారు.



