చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్( కె ) గ్రామంలో శ్రీరామ నవమి ఉత్సవాలు కనుల పండువగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు. Mahilaluమంగళ హారతులతో తరలివచ్చారు. భారీ శోభాయాత్రను చేపట్టారు. ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కు గ్రామస్తులు ముందుగా స్వాగతం పలికారు. రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆలయ నిర్మాణానికి వేద పండితులు, వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే శ్రీరామ నవమి రోజు వరకు ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో. సర్పంచ్ మధుప్రీతి, సురేష్, గ్రామ పెద్దలు సగ్గుల్లా శ్రీనివాస్, బంటు రవి, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, గ్రామస్తులు ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.



