చిత్రం న్యూస్, బైంసా : భైంసాలోని గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంనుంచి నూతన కోర్సులు ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య తెలిపారు. బి.కామ్‌లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ ( బిఎఫ్ ఎస్ ఐ ) అదేవిధంగా బీఎస్సీ కోర్సులో డెయిరీ, పౌల్ట్రీ సైన్స్ విభాగంలో అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఏఈడీపీ ) కోర్స్ప్రా లు ప్రారంభించగా ఈ కోర్సు 3 సంవత్సరాలపాటు కొనసాగుతూ, యూజీసీ, ఎన్ ఈ పి 2020 మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుంది. ఇందులో 2 సంవత్సరాల తరగతి బోధనతో పాటు 1 సంవత్సరo తప్పనిసరి వేతనంతో కూడిన ఉద్యోగ శిక్షణ (ఓజెటి ) ఇవ్వబడుతుందన్నారు. ఈ విధానం విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించి, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక కోర్సులు అని ఈ కోర్సులో ప్రవేశం పొందాలని ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య తెలిపారు.



