Chitram news
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 11:55 pm Editor : Chitram news

రాష్ట్ర నాయకత్వంపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన జీవన్ రెడ్డి

చిత్రం న్యూస్, తెలంగాణ డెస్క్: రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ అంటూ రాజ్యాంగ విలువలను ముందుకు తీసుకెళ్తుంటే ఇక్కడ మాత్రం ఆ విలువలు కనిపించడం లేదు” అని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేసినట్లయ్యాయి.ఎమ్మెల్యే సంజయ్ వ్యవహారంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. “ప్రభుత్వంతో సమన్వయం వేరు… కానీ పార్టీ వ్యవహారాల్లో జోక్యం ఎందుకు?” అని ప్రశ్నించారు.పార్టీ వ్యవస్థను దెబ్బతీసే చర్యలుజరుగుతున్నాయని పరోక్షంగా విమర్శించారు.తన అనుచరుడి హత్య జరిగిన సమయంలో కూడా ముఖ్యమంత్రి స్పందించకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆరోపించారు.”ఓపికకు కూడా హద్దు ఉంటుంది… గత 20 నెలలుగా ఎన్నో అవమానాలను భరిస్తూ వచ్చాను” అంటూ తీవ్ర మనోవేదన వ్యక్తం చేశారు.చివరగా, “గౌరవం లేని చోట ఎలా పని చేయగలం?” అని ప్రశ్నిస్తూ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అయితే పార్టీని వీడినా ఇందిరా గాంధీ ఆశయాలను గౌరవిస్తూ ప్రజా సేవలో కొనసాగుతానని స్పష్టం చేశారు.జీవన్ రెడ్డి రాజీనామాతో జగిత్యాల జిల్లా కాంగ్రెస్‌లో గంభీర ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఆయన వెంట పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వెళ్లే అవకాశముండగా ఆయన తదుపరి రాజకీయ అడుగు ఏంటన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.