కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో వేమిరెడ్డి దంపతుల భేటీ
చిత్రం న్యూస్ నెల్లూరు: నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఢిల్లీలోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కేంద్ర హోం మంత్రి అమీత్ షా గారిని కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి.. వేమిరెడ్డి దంపతులను ఆప్యాయంగా పలకరించారు. పెన్నా నది కరకట్టల బలోపేతం మరియు చారిత్రక పినాకిని సత్యాగ్రహ ఆశ్రమ పరిరక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక అందచేశారు. 2021 నవంబర్ నెలలో సోమశిల జలాశయం...