నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత లేదు
చిత్రం న్యూస్, నిజామాబాద్: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి సత్య స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాలలో ఫుల్ ట్యాంక్ నింపుకోవడం వల్ల అనవసర రద్దీ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకులో సరిపడా ఇందన నిల్వలు ఉన్నాయని సరఫరా కూడా నిరంతరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు అవసరానికి మించి...