చిత్రం న్యూస్, నిజామాబాద్: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి సత్య స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాలలో ఫుల్ ట్యాంక్ నింపుకోవడం వల్ల అనవసర రద్దీ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకులో సరిపడా ఇందన నిల్వలు ఉన్నాయని సరఫరా కూడా నిరంతరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిలువ చేసుకోవద్దని సూచించారు. అలా చేయడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకూడదని, నిర్ధారించని సమాచారాన్ని షేర్బుమ్ చేయడం ద్వారా గందరగోళం సృష్టించవద్దని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని వదంతులు వ్యాప్తి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే చర్యలు చేపడితే సంబంధించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.




