Chitram news
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 10:45 pm Editor : Chitram news

టమాటా ధరల పతనం: రైతుల ఆందోళన

చిత్రం న్యూస్, తానూర్ : గత ఏడాది టమాటా ధరలు ఆకాశాన్నంటడంతో ఈ సీజన్ లో అధిక విస్తీర్ణంలో సాగు చేసిన రైతులు, ప్రస్తుతం ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కూలీ ఖర్చులను కూడా భరించలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు.

నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో ఈ ఏడాది టమాటా సాగు గణనీయంగా పెరిగింది. అధిక ధరల అంచనాతో రైతులు పెట్టుబడులు పెంచారు. అయితే, పంట చేతికొచ్చే సమయానికి మార్కెట్లో ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత ధరలతో పెట్టుబడి ఖర్చులు, కూలీల వేతనాలు కూడా చెల్లించడం కష్టంగా మారిందని రైతులు తెలిపారు. గత ఏడాది లాభాలు చూసి ఈ ఏడాది సాగు చేసిన తమకు, ఇప్పుడు తీవ్ర నిరాశ ఎదురైందని పేర్కొన్నారు.

నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని, వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. సరైన మద్దతు ధర లేకపోతే భవిష్యత్తులో టమాటా సాగుపైనే కాకుండా, ఇతర పంటల సాగుపై కూడా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై స్థానిక అధికారులు స్పందించి, రైతులకు అండగా నిలవాలని, మార్కెట్ లో ధరల స్థిరీకరణకు కృషి చేయాలని కోరుతున్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.