చిత్రం న్యూస్, బాసర:నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు పోగొట్టుకున్న తన మొబైల్ ఫోన్ ను బాసర ఆలయ సిబ్బంది అప్పజెప్పి తమ నిజాయతీ చాటారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గంభీరావుపేటకు చెందిన వనజ అనే భక్తురాలు ఆలయ ప్రాంగణంలో ఫోన్ ను మర్చిపోవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్లు శ్రీనివాస్, శోభారాణి గమనించి ఆలయ ఇన్స్పెక్టర్ సాయిలు కు అప్పజెప్పారు. వివరాల ఆధారంగా భక్తురాలిని పిలిపించి ఫోన్ ను అప్పజెప్పి ఆలయ సిబ్బంది తమ నిజాయతీని చాటారు. ఈ సందర్భంగా హోంగార్డులను పలువురు అభినందించారు.



