చిత్రం న్యూస్, బేల: గ్రామస్తుల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా, బుదవారం అవాల్‌పూర్ గ్రామంలో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈరగోళ్ల అనిల్, ఉప సర్పంచ్ దినేష్ పాల్గొని శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాభివృద్ధిలో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా త్వరలోనే ఇంటింటికీ రక్షిత మంచినీరు అందుతుందని సర్పంచ్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తమ గ్రామంలో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మిస్తుండటంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



