మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ రద్దు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు
చిత్రం న్యూస్,న్యూ దిల్లీ: దేశంలో రిజర్వేషన్ల అమలుపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును ఇచ్చింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను వీడి ఇతర మతాల్లోకి (ప్రధానంగా క్రైస్తవ, ఇస్లాం) మారిన వ్యక్తులకు షెడ్యూల్డ్ కులాల (SC) హోదా వర్తించదని, తద్వారా వారు రిజర్వేషన్ ప్రయోజనాలను కోల్పోతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తీర్పులోని ప్రధానాంశాలు: రాజ్యాంగ ఉత్తర్వు 1950: రాజ్యాంగబద్ధంగా ఎస్సీ హోదా అనేది కేవలం హిందూ, సిక్కు మరియు బౌద్ధ మతస్థులకు మాత్రమే పరిమితమని జస్టిస్...