*రాష్ట్ర అడ్ హక్ కమిటీ చైర్మన్ గా బద్దూరి వెంకటేశ్వర రెడ్డి
*రాష్ట్ర కమిటీ కో కన్వీనర్ గా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి
చిత్రం న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నాగోల్ ప్రాంతంలో పీఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో నూతన అడ్ హక్ కమిటీ ఏర్పాటు చేశారు. రెడ్ల భవిష్యత్తు, భద్రత, ఆర్థిక, రాజకీయ అసమానతలు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా మంగళవారం అన్ని సంఘాలు కూడా ఏకవాక్య తీర్మానంతో ఒకే సంఘాన్ని రాష్ట్రంలో ఒకటే రెడ్డి సంఘం ఉండాలనే నినాదంతో అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోకన్వీనర్ గా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డిని నియమించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద రెడ్లకు పేదరెడ్డి విద్యార్థులకు మేమున్నామని ఈ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు కోసం వారికి భరోసా ఇవ్వడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలకవర్గంతో పాటు బడ్జెట్ కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయా సామాజిక వర్గ ప్రజలకి రాష్ట్ర స్థాయిలో ఏదైతే ప్రభుత్వాలు వారికి హైదరాబాద్ నడిబొడ్డున కుల భవనాలు నిర్మించిందో అదే విధంగా తెలంగాణ రాష్ట్ర రెడ్ల కోసం పది ఎకరాల స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర అడ్ హక్ కమిటీ చైర్మన్ గా బద్దూరి వెంకటేశ్వర రెడ్డి, కన్వీనర్ గా బుట్టెంగారి మాధవరెడ్డి, కో కన్వీనర్లుగా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి కొట్టం మధుసూదన్ రెడ్డి వసంత రెడ్డి, నూకల పద్మ రెడ్డి, గంగుల శ్రీలత రెడ్డి, నందికొండ గీతరెడ్డి, సభ్యులుగా ఎన్నేపల్లి లింగారెడ్డి, ఎలిమినేటి సుమన్ రెడ్డి, సలహాదారులుగా ఏనుగు సంతోష్ రెడ్డి, పిట్టా శ్రీనివాస్ రెడ్డి, గోపు జైపాల్ రెడ్డి, నల్ల సంజీవరెడ్డి, నావల్గా సత్యనారాయణరెడ్డి, బొక్క భూపాల్ రెడ్డి, బొబ్బిలి దామోదర్ రెడ్డిని ఎన్నుకున్నారు. రాష్ట్ర కో కన్వీనర్ గా నా నియామకానికి సహకరించిన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి,రాష్ట్ర అడ్ హక్ కమిటీ చైర్మన్ గా బద్దూరి వెంకటేశ్వర రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.



