Chitram news
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 1:29 pm Editor : Chitram news

రైతులకు అందుబాటులో ఎన్‌ఎస్‌సి కూరగాయల విత్తన కిట్‌లు

చిత్రం న్యూస్, జైనథ్: నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (NSC) ద్వారా రైతుల కోసం 5 రకాల కూరగాయల విత్తనాలతో కూడిన ప్రత్యేక కిట్‌లు అందుబాటులోకి వచ్చాయని జైనథ్ మండల వ్యవసాయ అధికారి  పూజ  తెలిపారు. ఈ కిట్‌లో టొమాటో, మిర్చి, బెండకాయ, తోటకూర, పాలకూర వంటి నాణ్యత విత్తనాలు ఉన్నాయన్నారు. కిట్‌లు ఇంటి తోటల పెంపకానికి కూడా అనుకూలంగా ఉంటాయని తెలిపారు. విత్తన కిట్ లు కావాలనుకునే ఆసక్తి గల రైతులు ఉద్యానవన శాఖ HEO సతీష్ (8106048139) ను సంప్రదించవచ్చన్నారు.