Chitram news
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 4:09 pm Editor : Chitram news

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని మోదీ చిత్రపటం ఏర్పాటు చేయాలి: కలెక్టర్‌కు ఎంపీ గోడం నగేశ్ వినతి

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాన్ని అధికారికంగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేశ్ సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రధాని చిత్రపటాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, శాఖల్లో ప్రదర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, నాయకులు ధోనీ జ్యోతి, ఏనుగు రాకేష్ రెడ్డి, సన్నీ, ఆత్రం సాయి, వేద వ్యాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని చిత్రపటం ఏర్పాటు ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలో మరింత స్ఫూర్తి నింపవచ్చని వారు అభిప్రాయపడ్డారు.