Chitram news
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 10:24 am Editor : Chitram news

బోరు మోటారు ఏర్పాటు చేసి.. నీటి సమస్య తీర్చి

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం సవర్గం గ్రామంలో గత 3 రోజులుగా నీటి సమస్యతో బాధపడుతున్న గ్రామస్తులకు సర్పంచ్ గాదెకర్ ముత్తు బాయ్,అండగా నిలిచారు. బోరు బావి మోటారు కాలిపోవడంతో  సమస్యను గుర్తించిన సర్పంచ్ స్పందించి కొత్త బోరు మోటారును ఏర్పాటు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోనెలకొన్న ప్రతి సమస్యను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తానన్నారు.

<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /