రంజని తండా నుంచి రోడ్డు లేక ప్రజల అవస్థలు
చిత్రం న్యూస్, కుభీర్: కుభీర్ మండలంలోని రంజని తండా నుండి కుబీర్ వెళ్లే రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని గ్రామస్తులు విన్నవిస్తున్నారు.రంజని తండా నుండి కుభీర్ వెళ్లే ప్రధాన రహదారి గత రెండున్నర ఏళ్లుగా అధ్వాన్న స్థితిలో ఉంది. అసంపూర్తిగా నిలిచిపోయిన ఈ రోడ్డు పనుల వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని తండవాసులు పేర్కొంటున్నారు.అత్యవసర సమయంలో గర్భిణులని ఆసుపత్రికి తరలించాలంటే ఈ గుంతల రోడ్డుపై ప్రయాణించడం...