Chitram news
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 4:45 pm Editor : Chitram news

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం

చిత్రం న్యూస్, బేల :గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని బేల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫైజుల్ల ఖాన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పాటన్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధి హామీ నిధులు రూ.16 లక్షల వ్యయంతో పాఠశాల ప్రహరీ గోడ, కిచెన్ షెడ్, బాయ్స్ టాయిలెట్స్ పనులకు సర్పంచ్ గేడాం గులాబ్, ఉపసర్పంచ్ రాజు, గ్రామస్తులతో కలసి ఆయన భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాటన్ గ్రామానికి ఉపాధి హామీ నిధులు పాఠశాల ప్రహరీ గోడకు రూ.16 లక్షలు, సీ సీ రోడ్లకు రూ.7 లక్షలు, కల్వర్టు కొరకు రూ.20 లక్షలు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు,  అసెంబ్లీ ఇన్చార్జ్ కంది శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.రాబోయే రోజులలో మరెన్ని నిధులు తీసుకువచ్చి పాటన్ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తామనాన్నారు. ఈ కార్యక్రమంలో పాటన్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాం రెడ్డి, పురుషోత్తం రెడ్డి, నారాయణ్ రెడ్డి, అనిల్, జమీర్, సతీష్, రెడ్డి, రవీందర్, ఆనంద్ రావు, సూర్యభాన్, ఉద్ధవ్ తదితరులు పాల్గొన్నారు.

<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /