Chitram news
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 9:09 pm Editor : Chitram news

మెండోర మండలంలో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు 

చిత్రం న్యూస్, పోచంపాడ్: నిర్మల్ జిల్లా మెండోర మండలంలోని పోచంపాడ్ , దూదిగాం, మెండోర గ్రామాలలో ముస్లిం సోదరులు  రంజాన్ ప ం డుగను ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పండుగ సందర్భంగా ముస్లింలు నూతన వస్త్రాలు ధరించి, ఈద్గా మైదానాలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ వేడుకల్లో భాగంగా, ఒకరినొకరు ‘ఈద్ ముబారక్’ అంటూ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాల ప్రజలు, యువకులు, అధికారులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.ఈ వేడుకలలో పోచంపాడు గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ అధికారులు, మాధురి రాజు, ఉప సర్పంచ్ సతీష్, మాజీ సర్పంచ్ రమేష్ పాల్గొన్నారు. అలాగే, దూదిగాం గ్రామ సర్పంచ్ హరూన్ రషీద్ బాబా, నెహ్రూ నగర్‌కు చెందిన ధనరాజ్ వంటి ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.పండుగ వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెండోర పోలీస్ అధికారులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ జాదవ్ సుహాసిని ఆధ్వర్యంలో పోలీసులు పర్యవేక్షణ చేపట్టి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో ఈద్ పండుగ సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ముస్లింల పవిత్ర పండుగను అందరూ కలిసిమెలిసి జరుపుకోవడం మండల ప్రజల సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఈద్గా మైదానాలలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.

<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /