భైంసాలో ప్రశాంతంగా రంజాన్ వేడుకలు
*తప్పిపోయిన చిన్నారులను గుర్తించిన పోలీసులు చిత్రం న్యూస్, బైంసా: భైంసా పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. భారీ జనసందోహం మధ్య తప్పిపోయిన ముగ్గురు చిన్నారులను పోలీసులు చాకచక్యంగా గుర్తించి, వారి కుటుంబాలకు సురక్షితంగా అప్పగించారు. రంజాన్ పండగ సందర్భంగా భైంసా పట్టణంలోని ఈద్గా వద్దకు పెద్ద...